Aakasa Desaana Song Lyrics in Telugu | ఆకాశదేశానా ఆషాడమాసానా
Aakasa Desaana Song Lyrics in Telugu ఆకాశదేశానా ఆషాడమాసానా మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
| Song | Aakasa Desaana |
| Movie | Megha Sandesam |
| Music | Ramesh Nayudu |
| Singer | Yesu Dasu |
| Cast | A.n.r , Jayasudha , Jayaprada |
| Lyrics | Veturi |
Aakasa Desaana Song Lyrics in Telugu
ఆకాశదేశానా ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో
విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ ఎడారి దారులలో
ఎడద నేను పరిచానని
కడిమివోలె నిలిచానని
ఉరమని తరమని ఊసులతో
ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి
విన్న వేదనా నా విరహ వేదనా
ఆకాశదేశానా ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా
రాలుపూల తేనియకై…రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై…రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనాని
తొలకరి మెరుపుల లేఖలతో
రుధిర భాస్పజల ధారలతో
ఆ ఆ ఆ ఆ ఆ
విన్నవించు నా చెలికి
మనోవేదనా నా మరణయాతనా
ఆకాశదేశానా ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా
మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో
విడలేని మోహమో
వినిపించు నా చెలికి
మేఘసందేశం మేఘసందేశం




